Bigg Boss Telugu 9: నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి?.. రీతూ లవ్ ట్రాక్‌పై తల్లి సీరియస్ వార్నింగ్!

Bigg Boss Telugu 9: నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి?.. రీతూ లవ్ ట్రాక్‌పై తల్లి సీరియస్ వార్నింగ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా క్లైమాక్స్ కు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో టైటిల్ విజేత ఎవరో తేలనుంది. దీంతో హౌస్ లో గేమ్ మరింత హీటెక్కింది. ఈ 11 వారం నామినేషన్స్  వేడి ఒకవైపు ఉంటే.. మరోవైపు 'ఫ్యామిలీ వీక్' సందడితో హౌస్ మొత్తం ఎమోషన్స్‌తో నిండిపోయింది. పది వారాలుగా ఇంటిల్లిపాదికి దూరంగా ఉన్న కంటెస్టెంట్స్ తమ రక్తసంబంధీకులను చూసి ఆనంద భాష్పాలు విడుస్తున్నారు.

 హౌస్‌లో భావోద్వేగాల జల్లు

ఈ ఫ్యామిలీ వీక్‌లో ఇప్పటికే సుమన్, తనూజ, పవన్, దివ్య కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్స్‌కు ఎంతో ఉత్సాహాన్ని నింపారు. కుటుంబ సభ్యుల మాటలు, ఆలింగనాలు హౌస్‌మేట్స్‌లో కొత్త జోష్‌ను నింపాయి. అయితే, ఈ భావోద్వేగాల మధ్యే కంటెస్టెంట్స్‌ను సరదాగా ఆటపట్టించే సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.  ఈ రోజు (నవంబర్ 20న ) ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ తల్లి ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచారు.

రీతూని నిలదీత 

రీతూ తల్లి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టగానే హౌస్‌మేట్స్‌ను 'ఫాస్ట్ ఫార్వర్డ్', 'ఫ్రీజ్' అంటూ సరదాగా ఆటాడుకున్నారు. అయితే, కూతురు రీతూ దగ్గరకు రాగానే ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. మిస్ యూ అమ్మా అంటూ రీతూ ఏడుపు మొదలు పెట్టింది.. అయితే తల్లి వెంటనే తన కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకోకుండా సీరియస్ టోన్ మార్చారు. నిన్ను కొడతా! నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అంటూ పరోక్షంగా పవన్‌తో రీతూ నడుపుతున్న లవ్ ట్రాక్ గురించి నిలదీశారు. రీతూ వెంటనే మనం పక్కకెళ్దాం అమ్మా అంటూ టాపిక్‌ను డైవర్ట్ చేయాలని చూసినా.. తల్లి మాట వినకుండా ఏకంగా చపాతీ కర్ర తీసుకుని కొట్టేందుకు సిద్ధమయ్యారు.

►ALSO READ | Raja Singh : రాజమౌళి సినిమాలను బహిష్కరించాలి.. హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే!

కన్నీళ్లకు కరిగిపోయిన తల్లి

కానీ, ఎంత కఠినంగా ఉండాలనుకున్నా, కూతురి కళ్లలో కన్నీళ్లు చూసి తల్లి మనసు తట్టుకోలేకపోయింది. కూతురిని కొట్టలేక, చపాతీ కర్రను పక్కన పడేసి, వెంటనే దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నారు. ఎంతైనా తల్లి మనసు కదా..  బిగ్ బాస్ హౌస్‌లో గేమ్‌లో భాగంగా కూతురు చేసిన కొన్ని పనులపై అసహనం ఉన్నా, ఆప్యాయత ముందు ఆ కోపం నిలవలేకపోయింది. ఈ ఎపిసోడ్‌తో రీతూ లవ్ ట్రాక్ పై తల్లి వ్యతిరేకత స్పష్టమైనట్లు తెలుస్తోంది. మరి ఈ సంఘటన రీతూ గేమ్‌ను ఏ విధంగా మారుస్తుంది, హౌస్‌లో మిగిలిన రోజులు ఆమె ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది.