మహిళా క్రికెట్ లో మెరుపు ఇన్నింగ్స్ లు చూస్తావేమో కానీ భారీ ఇన్నింగ్స్ లు ఆడడం మాత్రం ఎప్పుడో అరుదుగా చూస్తూ ఉంటాం. మెన్స్ కు తాము ఏమీ తక్కువ కాదని కొంతమంది మహిళా క్రికెటర్లు బిగ్ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మెగ్ లాన్నింగ్ మెరుపు సెంచరీ చేసి షాక్ కు గురి చేసింది. అయితే లానింగ్ కొట్టింది అంతర్జాతీయ క్రికెట్ లో కాదు బిగ్ బాష్ లీగ్ లో. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బాష్ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం (నవంబర్ 20) సిడ్నీ సిక్సర్స్ తో మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడుతున్న మెగ్ లానింగ్ 61 బంతుల్లోనే సెంచరీ చేసింది.
ఈ మ్యాచ్ లో మెగ్ లానింగ్ 61 బంతుల్లోనే సెంచరీ చేసి 74 బంతుల్లో 135 పరుగులు చేసి ఔటైంది. ఆమె ఇన్నింగ్స్ లో 22 బౌండరీలతో పాటు నాలుగు సిక్సర్లున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఈ ఆసీస్ క్రికెటర్ తనలో ఇంకా ఎలాంటి సత్తా తగ్గలేదని నిరూపించింది. జట్టు స్కోర్ లో తాను 60 శాతం పైగా స్కోర్ చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ ఆసీస్ మాజీ స్టార్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడి తమ జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఇటీవలే మహిళల ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్ ను రిలీజ్ చేసి ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది.
ఆమె బిగ్ బాష్ లో 61 బంతుల్లో సెంచరీ కొట్టి ఆక్షన్ లో మరోసారి ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 74 బంతుల్లో 135 పరుగులు చేసి సెంచరీతో దుమ్ములేపింది. మరో ఓపెనర్ రైస్ మెక్కెన్నా హాఫ్ సెంచరీ చేసి తొలి వికెట్ కు లానింగ్ తో కలిసి 159 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించింది. లక్ష్య ఛేదనలో సిడ్నీ కేవలం 42 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా డక్ వార్త లూయిస్ పద్ధతిలో మెల్బోర్న్ స్టార్స్ 111 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
One of the best we've ever seen!
— Weber Women's Big Bash League (@WBBL) November 20, 2025
Meg Lanning has her second BIG BASH CENTURY! #WBBL11 pic.twitter.com/MpHnBpoKLq
