సీఎం కావాలంటే ఔరంగజేబు కావాల్సిందే..హరీశ్కు సీఎం రేవంత్ కౌంటర్

సీఎం కావాలంటే ఔరంగజేబు కావాల్సిందే..హరీశ్కు సీఎం రేవంత్ కౌంటర్

సీఎం సీటు నుంచి తప్పుకోవాలన్న హరీశ్ రావు   వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. హరీశ్ కు అధికారం కావాలంటే  మరో ఔరంగ జేబు అవతారం ఎత్తాల్సిందేనని సూచించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని హరీశ్ రావును నిలదీశారు రేవంత్. 

గత ప్రభుత్వం చేసిన దోపిడిని చూపించేందుకే   మేడిగడ్డకు వెళ్లామని చెప్పారు రేవంత్. లక్ష కోట్లు ఖుర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్లివ్వలేదని ఎద్దేవా చేశారు.  కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు చేతనైతలేదు..కానీ 150 కి.మీ ఉన్న నల్గొండకు వెళ్లడానికి చేతనైందని విమర్శించారు.  దోచుకున్నది దాచుకోవడానికి  బీఆర్ఎస్  పదేళ్లు పనిచేసిందన్నారు. పేదల కోసం పనిచేస్తుంటే..మామా అల్లుళ్లు,తండ్రీకొడుకులు  తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. తాను  సీఎంగా ప్రమాణం చేసి మేడిగడ్డ మరమ్మత్తులు చేసి నీళ్లు నింపి చూపెడతానని  హరీశ్ రావు  చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. హరీశ్ రావు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలైతదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.