రైతుబిడ్డ సీఎం అయితే కేసీఆర్ కళ్లు మండుతున్నయ్: రేవంత్ రెడ్డి

రైతుబిడ్డ సీఎం అయితే కేసీఆర్ కళ్లు మండుతున్నయ్: రేవంత్ రెడ్డి

కొడుకు వాస్తు  కోసం కేసీఆర్.. సెక్రటేరియట్ కూల్చితే తాను సీఎం పోస్టులో కూర్చున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక రైతు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. రెండు నెలలు కాలే అపుడే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరవీరుల స్థూపం దగ్గర ఉరేసుకున్నా  కేసీఆర్,హరీశ్ రావులకు  సానుభూతి రాదన్నారు రేవంత్ రెడ్డి. . రేషనలైజేషన్ పేరుతో కేసీఆర్ సర్కార్ స్కూళ్లను  మూసేశారని ఆరోపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్  ఇయ్యలేనిది తాము 70 రోజుల్లో  ఇస్తున్నామన్నారు.ఎల్బీ స్టేడియంలో  గురుకుల టీచర్స్ ,లైబ్రేరియన్స్ కు నియామక పత్రాలు ఇచ్చారు సీఎం రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడారు రేవంత్.

సీఎం పదవిపై మాజీ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. సీఎం అవుతానంటున్న   హరీశ్ రావు ..మరో ఔరంగ జేబు కావాల్సిందే.. పదేళ్లు అధికారంలో  ఉన్నపుడు  గాలికి తిరిగారా? అని ప్రశ్నించారు.   దోచుకున్నది దాచుకోవడానికి  బీఆర్ఎస్  పదేళ్లు పనిచేసిందన్నారు. పేదల కోసం పనిచేస్తుంటే..మామా అల్లుళ్లు,తండ్రీకొడుకులు  తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన దోపిడిని చూపించేందుకే   మేడిగడ్డకు వెళ్లామని చెప్పారు రేవంత్. లక్ష కోట్లు ఖుర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్లివ్వలేదని ఎద్దేవా చేశారు.  కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు చేతనైతలేదు..కానీ 150 కి.మీ ఉన్న నల్గొండకు వెళ్లడానికి చేతనైందని విమర్శించారు.  

2004 స్ఫూర్తితోనే తాను మీ ముందుకొస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్..2004లో ఇచ్చిన రుణమాఫీ, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ ఇపుడు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ గెలుపులో నిరుద్యోగుల కృషి మరువలేనిదన్నారు.  ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొట్లాడారు..అమరులయ్యారని చెప్పారు.   ఉద్యోగ నియామకాల్లో గత సర్కార్ విఫలమైందన్నారు.  వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలొస్తున్నాయని చెప్పారు.  బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పేపర్లను జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారని ఆరోపించారు. యూపీఎస్ సీ తరహాలో పగడ్బందీగా  పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.  కొడంగల్ లో నాలుగు గురుకుల మోడల్ స్కూళ్లను ప్రారంభించబోతున్నామని చెప్పారు రేవంత్.