
రెండో రోజుతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు తాగునీరు ఇవ్వలేదన్నారుజ. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. తండాలను పంచాయతీలుగా మార్చిన వసతులు కల్పించలేదన్నారు. చాలా తండాలకు రోడ్డు మార్గం లేదన్నారు. నిర్లక్ష్యానికి గురైన తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు రేవంత్.
అన్ని మండలాలకు తాగునీరు, విద్యుత్ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తండాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తండాలు,గూడాలు అభివృద్ది చెందితేనే అసలైన అభివృద్ధి జరిగినట్టు అని అన్నారు. తప్పు చేశారని ప్రజలు తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదన్నారు. ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని విమర్శించారు.
జూలై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూలై 25న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.