దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా..గడ్డం ప్రసాద్ను అధ్యక్షా అనాల్సిందే...

దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా..గడ్డం ప్రసాద్ను  అధ్యక్షా అనాల్సిందే...

చదువుకుంటేనే  ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  చదువు మీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టబడి అని చెప్పారు.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయన్నారు.  కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా  అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ ను  అధ్యక్షా అని పిలవాల్సిందేనన్నారు. 

బంజారాహిల్స్ లోని తెలంగాణ ప్రభుత్వం, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో... డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. .దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారని తెలిపారు.  రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని చెప్పారు.  జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ALSO READ :- Harika Narayan :ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్..

గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవని తెలిపారు రేవంత్.  దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామన్నారు.  ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేస్తామన్నారు.  పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో శంకుస్థాపన చేశామన్నారు.  చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.. చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పారు రేవంత్ రెడ్డి.