
సీఎం రేవంత్ రెడ్డి జూన్ 24న ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పెద్దలో భేటీకానున్న రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణపై మరోసారి చర్చించే ఛాన్స్ ఉంది. ఇటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది.