తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సౌత్ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సియోల్ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు అమలు చేస్తోందన్నారు. సత్వర అనుమతితోపాటు.. ప్రపంచ స్థాయి వసతలు కల్పిస్తున్నామన్నారు రేవంత్.
రాష్ట్రంలో మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. దీంతోపాటు అత్యాధునిక కార్ల తయారీకి ప్లాన్ చేస్తామంది. దీని ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారీగా ఉపాధి లభించనుంది.