ఇది బహుజనుల తెలంగాణ.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వాళ్లది దొరల న్యాయం:సీఎం రేవంత్

ఇది బహుజనుల తెలంగాణ..  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వాళ్లది దొరల న్యాయం:సీఎం రేవంత్
  •     వచ్చే ఎన్నికల్లో 117 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తం
  •     అర్హులైన గీత, నేత కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తం
  •     ముదిరాజ్‌‌‌‌‌‌‌‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తం 
  •     మా ప్రభుత్వంలో ఏడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నం
  •     మేం చేసినవన్నీ చెబితే.. ప్రతిపక్షం బయటకు కూడా రాలేదని వ్యాఖ్య
  •     ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్​పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

 హైదరాబాద్, వెలుగు:  ‘ఇది బహుజనుల తెలంగాణ .. ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయమే తప్ప దొరల న్యాయం ఉండదు..’ అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు.  బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన కులం, కుటుంబం కోసం మాత్రమే పనిచేయలేదని,  బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తి తో బహుజనుల బిడ్డలు  రాజ్యం ఏలాల్సిన అవసరం ఉందన్నారు. ‘కులవృత్తులను గౌరవిద్దాం.. అదే సమయంలో ఆయా వర్గాల పిల్లలు బాగా చదివి, ప్రజాప్రతినిధులుగా, ఐఏఎస్​లుగా, ఐపీఎస్​లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఎదిగి,  తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు.

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌‌లోని ట్యాంక్ బండ్‌‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసి న సభలో ఆయన మాట్లాడారు. అర్హులైన గీత, నేత కార్మి కులందరికీ చేయూత పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించానని,  ఎవరికైనా రాకుంటే యువకులు ముందుకొచ్చి పెన్షన్ ఇప్పించాలని సూచించారు. కులవృత్తులను గౌరవిస్తూనే, తరతరాల పేదరికాన్ని జయించడానికి పిల్లలను ఉన్న త విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యారంగానికి ఎన్ని వందల కోట్లయినా కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కులవృత్తుల పరిరక్షణకు, యువత ఉన్నత చదువులు, -స్కిల్ డెవలప్‌‌మెంట్‌‌కు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతామని తెలిపారు.

ప్రతిపక్షాల కుట్రలు నమ్మొద్దు 

ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు, కుట్రలను నమ్మొ ద్దని ప్రజలకు సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అప్పుల చిట్టా.. ఆ పరిమితుల్లోనూ మేం చేసి చూపించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలన్నీ బయటపెడితే.. ప్రతిపక్ష  నాయకులు ఇక ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేరు” అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు  సన్న బియ్యంతో భోజనం, పోషకాలతో కూడిన అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. గత పాలకులు బహుజనులను, బీసీలను కేవలం గొర్రెలు, బర్రెలు మేపుకోవడానికి, చేపలు పట్టుకోవడానికి, చెప్పులు కుట్టుకోవడానికి మాత్రమే పరిమితం చేయాలని చూశారన్నారు. వారి పిల్లలు మాత్రమే రాజ్యాలు ఏలాలని, పేదల పిల్లలు ఉన్నత చదువులకు దూరం కావాలని కుట్రలు పన్నారని తెలిపారు.  కానీ తమ  ప్రభుత్వం బహుజన బిడ్డలను పీజీలు, పీహెచ్‌‌డీలు చదివించి, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, లాయర్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించిందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ ప్రజా ప్రభుత్వానికి నిరంతరం అండగా నిలవాలని ప్రజలను కోరారు. 

అప్పులున్నా సంక్షేమంలో తగ్గట్లే!

ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లు, స్పోర్ట్స్​ యూనివర్సిటీ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ. 2 వేల స్కాలర్‌‌‌‌షిప్‌‌లాంటి విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల11 వేల కోట్ల అప్పుల భారం తమకు ముప్పుగా మారి, ఏటా రూ. 75వేల కోట్ల వడ్డీలు కడుతున్నప్పటికీ.. సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదన్నారు.  రూ. 36 వేల కోట్ల రైతు భరోసా అందించామని, రూ. 95 వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేశామని, మహిళా సంఘాలకు రూ. 60 వేల  కోట్ల బ్యాంక్ లింక్డ్​ రుణాలు అందించామని సీఎం వివరించారు. మన ప్రభుత్వంలో ఏడు లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పారు. జయజయహే తెలంగాణకు విముక్తి కలిగించింది.. -వందేండ్ల బీసీ కులగణన చేసింది ఈ ప్రభుత్వం కాదా? అని అడిగారు. కర్నాటక, తమిళనాడు వెళ్లి ‘అఘోరా రావు’తో చేతబడి పూజలు చేయిస్తున్నారని, రాష్ట్రంలో కరువు వచ్చి రైతులు నష్టపోవాలని కోరుకునే స్థాయికి బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు దిగజారారని విమర్శించారు. ‘‘అధికారం కోసం ఇంతకు దిగజారుతారా?’’ అని ప్రశ్నించారు. ఇలాంటి చేతబడి చేసేటోన్ని ఊర్లకు వస్తే చెట్టుకు కట్టేయాలె అని అన్నారు. 

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తం  

 పాపన్న గౌడ్ విగ్రహాన్ని నగ ర గుండెకాయ లాంటి ప్రాంతంలో ప్రతిష్టిం చడం ద్వారా బహుజన వీరుల స్ఫూర్తిని పునరుజ్జీవింపజే శామని  సీఎం తెలిపారు. 2029 ఎన్నికల్లోనూ పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్, సీఎల్పీ నేతగా తన కాంబినేషన్​లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 117 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్, డీఎస్​ కాంబినేషన్‌‌లో పదేండ్ల పాటు పాలన సాగించినట్లే, ప్రస్తు తం తమ కాంబి నేషన్‌‌లో కూడా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని చెప్పారు. ముదిరాజ్‌‌ల ఆరా ధ్య దైవం పండుగ సాయ న్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామ న్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపా నికి ఇచ్చే ప్రాధాన్యతే పాపన్న గౌడ్ విగ్రహా నికి ఇస్తామని అన్నా రు. ‘‘నీటిపారు దల ప్రాజెక్టులు, కాలువల గట్ల వెంట వేలాది ఈత, తాటి చెట్లను నాటాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అధికారు లను ఆదేశిస్తున్నా. దీంతో గీత కార్మికులు ఎలాంటి తగాదాలు లేకుండా తమ కులవృ త్తిని గౌరవప్రదంగా కొనసాగించవచ్చు. నాణ్యమైన కల్లును ప్రజలకు అందించడమే కాకుండా, రాబో యే వందేండ్లపాటు ఈ వృత్తిని కాపాడేందుకు కాలువ గట్ల వెంట చెట్ల పెంపకం దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి గౌడన్నలు అంతా సహకరించాలని సీఎం కోరారు.