
- తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీ కలిసింది. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగనున్న తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి పెళ్లికి రావాలని సీఎం దంపతులను పొంగులేటి కుటుంబం ఆహ్వానం అందించింది.
మంగళవారం సీఎం నివాసానికి వెళ్లి శుభలేఖను అందించింది. పెళ్లికి వచ్చి కొత్త జంటను ఆశీర్వాదించాలని సీఎం దంపతులను పొంగులేటి ఫ్యామిలీ కోరింది.