సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలై మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవ్వడంతో సర్పంచ్​పదవులపై కన్నేసిన ఆశావాహులు రంగంలోకి దిగారు. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు. గ్రామంలో గుడి, బడిలాంటి అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో డబ్బులిస్తామని ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఇస్తామని ప్రజాప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి కోసం 15 మంది పోటీ పడ్డారు. 

ALSO READ : సర్పంచ్ ఏకగ్రీవానికి ఎకరం భూమి, కోటి ప్యాకేజీ.. 

ఈ క్రమంలో గ్రామపెద్దలంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఎన్నిక ఏకగ్రీవమైనప్పటికీ సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించలేదు. సర్పంచ్ పదవిని ఆశిస్తున్న 15 మంది లోంచి ఒకరి పేరును సీల్డ్ కవర్‎లో ప్రకటించనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఏ పార్టీ మద్దతు గల అభ్యర్థి విజయం సాధిస్తారనే ఉత్కంఠకు తెరపడింది.