పదేండ్ల పాలనలో కుటుంబాన్ని బాగుచేసుకున్నారు.. గ్రూప్ 1 నిర్వహించలేక పోయారు: సీఎం రేవంత్

పదేండ్ల పాలనలో కుటుంబాన్ని బాగుచేసుకున్నారు.. గ్రూప్ 1 నిర్వహించలేక పోయారు: సీఎం రేవంత్

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కుటుంబాన్ని బాగు చేసుకున్నారని.. కానీ గ్రూప్ 1 నిర్వహించలేకపోయారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం (సెప్టెంబర్ 27) శిల్పకళా వేదికలో నిర్వహించిన గ్రూప్ 1 కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. గ్రూప్ 1 కు ఎంపికైన 562 మందికి నియామక పత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ కామెంట్స్:

  • మీరే తెలంగాణ భవిష్యత్
  • తెలంగాణ కుటుంబంలో మీరు భాగస్వాములు
  • తెలంగాణలో ఏ ఉద్యమమైనా చైతన్యం నుంచే వచ్చింది
  • తెలంగాణ గడ్డకు వీరోచితమైన గాధలు ఉన్నాయి
  • ఈ గడ్డకు పోరాటం ఉంది. . పౌరుషం ఉంది
  • పదేండ్లు పాలించినోళ్లు కుటుంబాన్ని బాగు చేసుకున్నారు
  • కలిసొచ్చి రెండు సార్లు గెలిస్తే కారణ జన్ములుగా భావించారు
  • విశ్వాసంతో అధికారం ఇస్తే విశ్వాస ఘాతకులుగా మారారు
  • పదేండ్లు గ్రూప్ 1 నిర్వహించలేదు.. ఇంతకు మించిన నిర్లక్ష్యం ఏముంది..?
  • పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఓ RMP ని నియమించారు
  • ప్రశ్నాపత్రాలు పబ్లిక్ సెంటర్లలో దొరికాయి
  • నిజామాబాద్ ఎన్నికల్లో ఓడినా కవితకు పదవి ఇచ్చారు
  • గ్రూప్ 1 పోస్టులు రెండు కోట్లు, మూడు కోట్లకు అమ్ముకున్నారని దుష్ప్రచారం చేశారు
  • ఎవరెన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా తట్టుకున్నాం
  • ఈ కుట్రల వెనుక కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి
  • అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం
  • టీజీపీఎస్సీ రాజకీయ పునరవాస కేంద్రం కాదు.. తెలంగాణ పునర్ నిర్మాణ  కేంద్రం
  • నేను 2 కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్మానా...?
  • ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంతలా బాధ పడలేదు