దమ్ముంటే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించు..కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

దమ్ముంటే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించు..కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్

చేవెళ్ల సభలో  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేపదే కాంగ్రెస్  ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తుందని..కార్యకర్తల అండ ఉన్నంతసేపు ఈ కుర్చీని ఎవరూ  తాకలేరని వ్యాఖ్యానించారు. తాను అయ్యపేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చోలేదు..అల్లాటప్పాగాన్నీ కాదు..నల్లమల్ల అడవి నుంచి మెట్టు మెట్టు ఎదిగి సీఎం అయ్యానని చెప్పారు.  

ప్రజలు బొంద పెట్టినా కేటీఆర్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అడవి పందుల్లా తెలంగాణను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎవరైన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటే..వాళ్లను ఊర్లల్లా చెట్టుకు తలకిందులుగా వేలాడదీయాలని సూచించారు రేవంత్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రానివ్వకుండా పోరాడాలని కార్యకర్తలకు  సూచించారు .బీఆర్ఎస్ నేతలు చవటగాళ్లు.. పొద్దున్న లేస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు రేవంత్. 

కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎన్నికల ముందున్న జోష్ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో  కార్యకర్తల కష్టం ఉందన్నారు.   ప్రజల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు.  సోనియా మాటిస్తే నెరవేరుస్తారని తెలిపారు.  ఆరుగ్యారంటీల అమలు పైన  ఫోకస్ పెట్టామన్నారు. మంచి చేస్తుంటే..ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందన్నారు.  పేదోళ్లకు ఉద్యోగాలిస్తే.. కేసీఆర్  కడుపు మండుతుందన్నారు. ప్రాజెక్టుల ముసుగుల వేల కోట్ల దోపిడి జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే  25 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చాం.. త్వరలో మెగా డీఎస్పీ ప్రకటిస్తామని చెప్పారు. 

ALSO READ "చంద్రునిపై ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీ రీసెర్చ్ ఫొటోస్ ఇవే..

 

పారదర్శక నియామకాల కోసం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశామని చెప్పారు సీఎం రేవంత్.  మహిళలకు రుణాలిచ్చి కోటీశ్వరులను చేసే బాధ్యత తమదేనన్నారు.   రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించడం కోసం పనిచేస్తామని చెప్పారు.  పార్టీ జెండాను మోసిన వాళ్లను గెలిపించే బాధ్యత తమదేనన్నారు.  త్వరలో గ్రామాల్లో  ఇందిరమ్మ కమీటీలు వేస్తాం..ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే  బాధ్యతను అప్పగిస్తామని చెప్పారు.