మమ్మల్ని టచ్ చేస్తే కథ వేరే ఉంటది..ముగ్గురే మిగుల్తరు: సీఎం రేవంత్ రెడ్డి

మమ్మల్ని టచ్ చేస్తే కథ వేరే ఉంటది..ముగ్గురే మిగుల్తరు: సీఎం రేవంత్ రెడ్డి

 ప్రభుత్వాన్ని పడగొడతామంటున్న బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.  తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో ముగ్గురే మిగులుతారని అన్నారు. మమ్మల్ని టచ్ చేస్తే కథ వేరే ఉంటదని..తన పని తనను చేసుకోనివ్వాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండమని చెప్పారు రేవంత్. 

 తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.   ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. మిగిలిన గ్యారంటీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  గత సర్కార్ రాష్ట్రాన్ని నిండా ముంచిందన్నారు. పదేళ్లలో వంద సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేసిందని విమర్శించారు.  3 నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని చెప్పారు.  టీఎస్పీని ప్రక్షాళన చేశాం.. 30 రోజుల్లో చరిత్ర సృష్టించామన్నారు. 

ఫ్రీ కరెంటులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  గతంలో  సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రజల్ని కలవలేదు.. ప్రజాపాలనలో  మేం ప్రజల దగ్గరకే పాలన తీసుకెళ్తున్నామని చెప్పారు.  రాష్ట్రాభివృద్దికోసం మెట్టు దిగిన, రాష్ట్ర సంక్షేమం కోసం అందరితో కలిసి ముందుకెళ్తున్నా. పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ నకలుగా మారిన టీఎస్ ను టీజీగా మార్చామన్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులు  రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాధ్యతగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.