రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో పోటీపడాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో పోటీపడాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో పోటీపడటమే తమ ప్రయత్నమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీలో  ఐకార్ బయాలాజిక్స్ కొత్త యూనిట్ కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి,శ్రీధర్ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్..  దేశంలో జీనోమ్  వ్యాలీలోనే వ్యాక్సిన్ల ఉత్తత్తి జరుగుతోందన్నారు.  కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పంపామని చెప్పారు. రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని చెప్పారు.  18 నెలల్లోనే 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చామని తెలిపారు రేవంత్.  రాష్ట్రాలతో కాదు..ప్రపంచ దేశాలతో పోటీపడాలన్నదే తమ  ప్రయత్నమని చెప్పారు. 

ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందన్నారు.  రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పారు సీఎం రేవంత్.  ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని కోరారు .

యువతకు ఉద్యోగాలే మా లక్ష్యం: మంత్రి వివేక్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు . అధిక ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగాన్ని తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి  ప్రయత్నిస్తున్నారని చెప్పారు. స్కిల్ యూనివర్శిటీ పెట్టిందే యువత కోసమన్నారు.  ఎక్కువ పరిశ్రమలు స్థాపించి..ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.  యువతకు ఉపాధి కోసమమే పెట్టుబడుల ప్రయత్నమని చెప్పారు. అన్ని రంగాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి వివేక్.