కోట మృతి పట్ల ప్రముఖుల నివాళి.. సినీ రంగానికి తీరని లోటు

కోట మృతి పట్ల ప్రముఖుల నివాళి.. సినీ రంగానికి తీరని లోటు

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతిపట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో ఆకట్టుకున్న కోట మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. కోట కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం రేవంత్. 

కోట శ్రీనివాస రావు మృతి సినీ రంగానికి తీరని లోటని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.  కళాసేవ,పోషించిన పాత్రలు చిరస్మణీయమన్నారు చంద్రబాబు.1999లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేశారని చెప్పారు. 

కోట మృతి బాధాకరమన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారన్న కోమటి రెడ్డి..కోట కుటుంబ సభ్యలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట శ్రీనివాస్ రావు జులై 13న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.  నాలుగు దశాబ్ధాల కెరీర్ లో 750కి పైగా సినిమాల్లో నటించారు.