
ముచ్చెర్లలో నిర్మించబోయే స్కిల్ వర్సిటీకి ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రను నియమిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికా టూర్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆగస్ట్ 1 2024 నాడు ముచ్చెర్లలో స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇది గడిచిన మరోరోజే సీఎం రేవంత్ రెడ్డిని ఆనంద్ మహింద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఆనంద్ మహింద్ర పేరును చైర్మన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.