హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఆదివారం (మార్చి 22) సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా తొలి విడత రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు.
ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా రూ.3600 కోట్ల నిధులు విడుదల చేయగా 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇవాళ ఆదివారం (మార్చి 22) కావడంతో రైతు భరోసా నిధులు సోమవారం (మార్చి 23) రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మిగితా నిధులు రెండు విడతల్లో ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేయనుంది.
