కొడంగల్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్‌కు చేరుకుంటారు. కుటుంబసభ్యులతో కలిసి పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తారు. అ
క్కడ రూ. 110 కోట్లతో చేపట్టే శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి, రూ.2 కోట్లతో కోస్గి పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి, దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
అలాగే కొడంగల్‌లో రూ.22 కోట్లతో నిర్మించిన 220 బెడ్ల హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆఫీసర్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
