సీఎం, డిప్యూటీ సీఎం.. టెస్ట్ డ్రైవ్

సీఎం, డిప్యూటీ సీఎం.. టెస్ట్ డ్రైవ్

ముంబై, నాగ్ పూర్ నగరాలను అనుసంధానిస్తూ నిర్మించిన ‘హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ థాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహా మార్గ్’ ను ఈనెల 11న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ఈ ఎక్స్ ప్రెస్ వేపై టెస్ట్ డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ ఇద్దరు నేతలు తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ‘‘ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నేను కలిసి ఎక్స్ ప్రెస్ వేను తనిఖీ చేశాం. ఒకే వాహనంలో నాగ్ పూర్ నుంచి షిర్డీ వరకు వెళ్లాం. నా కారును స్వయంగా ఫడ్నవీస్ డ్రైవ్ చేశారు’’ అని పేర్కొంటూ ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు. 

ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు ప్రత్యేకతలు..

  • దీనికి శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ థాక్రే పేరు పెట్టారు.
  • దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించారు.
  • సీఎం ఏక్ నాథ్ షిండే హయాంలో ఇది ప్రారంభం కాబోతోంది. 
  • ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.55వేల కోట్లు.
  • 701 కిలోమీటర్ల పొడవునా ఇది విస్తరించింది ఉంది. 
  • మహారాష్ట్రలోని 14 జిల్లాలు, 6 తాలూకాలు, 392 గ్రామాలను ఈ ఎక్స్ ప్రెస్ వే అనుసంధానిస్తుంది. 
  • ఈ మార్గం వల్ల ముంబై, నాగ్ పూర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటలు తగ్గిపోతుంది. 
  • ఇది 8 లేన్ల ఎక్స్ ప్రెస్ వే. రోడ్డుకు ఒక్కో వైపు చెరో 4 లేన్లు ఉంటాయి. 
  •