వాళ్లేమైనా దేవగురువులా?..ఇన్ఫోసిస్ మూర్తి దంపతులపై కర్నాటక సీఎం ఫైర్

వాళ్లేమైనా దేవగురువులా?..ఇన్ఫోసిస్ మూర్తి దంపతులపై కర్నాటక సీఎం ఫైర్
  • క్యాస్ట్ సర్వేలో పాల్గొనబోమన్న కామెంట్లపై విమర్శలు

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సర్వేలో పాల్గొనకపోవడంపై ఇన్ఫోసిస్  ఫౌండర్  నారాయణమూర్తి, ఆయన భార్య సుధా మూర్తిపై ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఫైర్ అయ్యారు.

 ‘‘క్యాస్ట్  సర్వేలో పాల్గొనాలా, వద్దా అన్నది వారి ఇష్టం. అయితే, మేం చేస్తున్న సర్వే బీసీల కోసమని భావించడమే తప్పు. రాష్ట్రంలోని ఏడు కోట్ల ప్రజల కోసం చేపట్టిన సర్వే ఇది. అధికారులకు తాము బీసీలం కాదని, సర్వేలో పాల్గొనబోమని మూర్తి దంపతులు చెప్పారు. బీసీలు కాకుంటే సర్వేలో పాల్గొనకూడదా? ఇన్ఫోసిస్ స్థాపించినంత మాత్రానా వాళ్లు దేవగురువులు అయిపోతారా?” అని సీఎం వ్యాఖ్యానించారు. 

జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అప్పుడేం చెబుతారని మూర్తి దంపతులను సిద్దూ ప్రశ్నించారు.