CM Vijay Played Chess: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (C Joseph Vijay), యంగ్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ( Praggnanandhaa)ల మధ్య సెక్రటేరియట్‌లో ఒక క్రేజీ సీన్ కనిపించింది. నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రజ్ఞానంద ఈరోజు (సోమవారం) సీఎం విజయ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కాసేపు చెస్ బోర్డు ముందు కూర్చుని ముచ్చటగా ఒక గేమ్ ఆడారు.
సీఎం విజయ్ ని ఓడించిన ప్రజ్ఞానంద:
ప్రెస్టీజియస్ నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేసిన ప్రజ్ఞానంద.. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సెక్రటేరియట్‌కు వెళ్లాడు. ఈ ఇంటరాక్షన్ టైమ్‌లో సీఎం విజయ్ చెస్ బోర్డుపై ఒక కిర్రాక్ మూవ్ (ఎత్తు) వేయగా.. ప్రజ్ఞానంద, పక్కనే ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులు మస్తు ఇంట్రెస్టింగ్‌గా చూశారు. చివరకి సీఎం విజయ్ ని ప్రజ్ఞానంద ఓడించాడు.
రూ. 50 లక్షల చెక్కు:
ప్రజ్ఞానంద సాధించిన అద్భుతమైన ఘనతకు గుర్తుగా.. తమిళనాడు క్రీడా అభివృద్ధి శాఖ (SDAT) తరఫున సీఎం విజయ్ ఏకంగా రూ. 50 లక్షల నగదు బహుమతి చెక్కును ప్రజ్ఞానందకు అందజేశారు. ప్రజ్ఞానంద తాను గెలుచుకున్న నార్వే చెస్ ట్రోఫీని ముఖ్యమంత్రికి చూపించగా.. విజయ్ మనోడిని మనస్ఫూర్తిగా తీసుకుని మరింత మంది చెస్ ఆడాలని పిలుపునిచ్చారు.
ప్రజ్ఞానందకు ఏటా రూ. 30 లక్షల సాయం:
తమిళనాడు ప్రభుత్వం స్పోర్ట్స్ పర్సన్స్‌కు ఫైనాన్షియల్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. SDAT కింద నడుస్తున్న 'ఎలైట్ స్కీమ్' లో ప్రజ్ఞానంద కూడా ఒక బెనిఫిషియరీ.. ఈ స్కీమ్ ద్వారా అతడికి గవర్నమెంట్ నుంచి ఏటా రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందుతోంది.
ALSO READ : ఆర్భాటాలు పక్కన పెట్టండి సార్..
చెన్నైలో హోమ్ ఆఫ్ చెస్ అకాడమీ:
తమిళనాడును చెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడానికి ప్రభుత్వం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో హోమ్ ఆఫ్ చెస్ (Home of Chess) అనే అడ్వాన్స్‌డ్ అకాడమీని కూడా స్టార్ట్ చేసింది. యంగ్ ప్లేయర్లకు ఇంటర్నేషనల్ లెవెల్ కోచింగ్, ఎక్స్‌పోజర్ ఇవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతోంది. కాగా చెన్నైలోనే పుట్టి పెరిగిన ప్రజ్ఞానంద.. నార్వేలోని ఓస్లోలో జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రెస్టీజియస్ టైటిల్ గెలిచి ఇండియన్ చెస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైలురాయిని క్రియేట్ చేశాడు.
VIDEO | Tamil Nadu: Chess Champion Pragyanandha meets Chief Minister Vijay after winning the Norway Chess tournament. Plays a game of chess.
— Press Trust of India (@PTI_News) June 8, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/uJcpsfiFxs
