
అయోధ్యలో 7 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ . రోజ్ వుడ్ తో ప్రత్యేకంగా తయారుచేసిన ఈ విగ్రహాన్ని శోధ్ సంస్ధాన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
కోదండరాముని అవతారంలో ఈ విగ్రహాన్ని తయారుచేశారు. మ్యూజియంలో రాముని గురించి.. చారిత్రక ఘట్టాలతో పాటు 2500కు పైగా చిత్రాలు, కళారూపాలు ఉన్నా.. కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. దీంతో.. కర్ణాటక స్టేట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎంపోరియం నుంచి రూ.35 లక్షలు ఖర్చుచేసి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. శ్రీరాముని.. విగ్రహం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.