ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు జరగడానికి ఇంకా సమయం ఉన్నా.. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని విపక్షాలు కామెంట్లు చేస్తూనే ఉన్నాయి.. ఇదే సమయంలో ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధం అని ప్రకటిస్తున్నారు.. అయితే, ఈ రోజు ( జూన్ 7) జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కేబినెట్‌ ముగిసిన అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం జగన్.. ముందస్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చేశారు.. ఎన్నికలకు ఇంకా మిగిలి ఉన్నది 9 నెలలేనన్న జగన్.. ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదేనని.. తొమ్మిది నెలల పాటు కష్టపడండి.. మిగిలినది తాను చూసుకుంటానంటూ మంత్రులతో తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.