ఏపీలో గడప గడపకు రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం

ఏపీలో గడప గడపకు రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం

ఏపీలో గడప గడపకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా 9 వేల 260 మొబైల్ డెలివరింగ్ యూనిట్స్ వాహనాలు ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర వివిధ జిల్లాలకు చెందిన వాహనాలను జెండా ఊపి మొదలుపెట్టారు. కార్యక్రమంలో ఏపీ సివిల్ సప్లై శాఖ మంత్రి కొడాలి నాని, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు వాహనాల పనితీరును అడిగి తెలుసుకున్నారు జగన్.

రేషన్ సరుకులతో పాటు, బ్యాగును విడుదల చేశారు.  ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.