The Family Star Trolls: థియేటర్స్లోనే కాదు OTTలోనూ వదలట్లేదు.. ఫ్యామిలీ స్టార్పై మళ్ళీ ట్రోల్స్

The Family Star Trolls: థియేటర్స్లోనే కాదు OTTలోనూ వదలట్లేదు.. ఫ్యామిలీ స్టార్పై మళ్ళీ ట్రోల్స్

ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) టైం అస్సలు బాగున్నట్టు లేదు. ఆయన చేసిన వరుస సినిమాలు ప్లాప్ గా నిలుస్తున్నాయి. నిజానికి విజయ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది. 2018లో వచ్చిన గీతగోవిందం తరువాత ఇప్పటివరకు సరైన హిట్టు లేదు ఈ హీరోకి. ఈ సినిమా తరువాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషీ సినిమాలు చేశాడు విజయ్. ఇన్ని సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మినిమమ్ సక్సెస్ సాధించలేకపోయాడు విజయ్. అందుకే తనకి  గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు పరశురామ్ తో లేటెస్ట్ గా ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు విజయ్. 

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమాకి కూడా ఆడియన్స్ నుండి నెగిటీవ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు.. ఈ సినిమాపై తీవ్రమైన ట్రోలింగ్ కూడా నడించింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ను ఆడేసుకున్నారు నెటిజన్స్. గత వారం రోజుల నుండి ట్రోలింగ్ తగ్గింది అనుకంటున్న వేల.. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. 

కారణం.. ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను చూసిన నెటిజన్స్ మరోసారి ఈ ట్రోలింగ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీని మరీ దారుణంగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభంలో పిల్లలకు దోషాలు వేసిచ్చే సీన్, బండిలో ఇరవై రూపాయల పెట్రోల్ కొట్టించడం వంటివి మరీ ఓవర్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఇలా ఓటీటీ రిలీజ్ తరువాత మరోసారి ట్రోలింగ్ అవుతోంది ఈ మూవీ. మరి ఈ ట్రోలింగ్ పై మేకర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి.