సీపీఎం ఫుల్ సపోర్ట్ మాకే: సీఎం రేవంత్ రెడ్డి

సీపీఎం ఫుల్ సపోర్ట్ మాకే: సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం ఫుల్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీపీఎం రాష్ట్ర ముఖ్య నాయకులను సీఎం రేవంత్ రెడ్డి శనివారం  కలిసి చర్చించారు. వారిలో కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు నేతలు ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ తోపాటు ఇతర అన్నీ నియోజకవర్గాల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారిని కోరారు. మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా సీపీఎం పార్టీ ముందు ఉంచామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్, సీపీఎం పార్టీల మధ్య ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా.. అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని ప్రకటించారు. బీజేపీ లాంటి శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు ఇస్తుందని చెప్పారు. సీపీఎం పార్టీ సహకారంతో భవిష్యత్ లో ముందుకు వెళ్తామని, ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతుందని భావిస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు.