సీఎం జగన్ వైజాగ్ టూర్ - శారదా పీఠంలో రాజశ్యామల యాగం..!

సీఎం జగన్ వైజాగ్ టూర్ - శారదా పీఠంలో రాజశ్యామల యాగం..!

సీఎం వైఎస్ జగన్ వైజాగ్ టూర్ లో భాగంగా శారదా పీఠాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు.శారదా పీఠాన్ని చేసారుకోగానే సాంప్రదాయ దుస్తుల్లో అక్కడి దేవతామూర్తులను దర్శించుకొని, రాజశ్యామల యాగంలో పాల్గొన్న తర్వాత పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి వారిని కలవనున్నారు. సీఎం పర్యటన సందర్బంగా పోలీసులు శారదా పీఠాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేనిదే ఏ ఒక్కరిని లోపలి అనుమతించటం లేదు. పీఠం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు.

శారదా పీఠంలో వార్షికోత్సవాలు సందర్బంగా 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఈ వార్షికోత్సవ ముగింపు ఉత్సవాల్లో భాగంగా 19న సీఎం హాజరవుతారని అందరూ భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల హాజరు కాలేదు. రాజశ్యామల యాగంలో భాగంగా ఇవాళ పూర్ణాహుతి హోమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

యాగం తర్వాత సీఎం వైజాగ్ లో జరుగుతున్న మిలాన్ 2024 సైనిక విన్యాసాల కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనటం, రాజశ్యామల యాగం చేయటం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ యాగం ప్రాధాన్యతను సంతరించుకుంది.