హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎం ప్రజావాణి చొరవతో ఓ చిన్నారికి పునర్జన్మ లభించింది. నిమోనియాతో బాధ పడుతున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ బానోతు శ్రీను, అంజలి దంపతుల 17 నెలల కుమారుడు వైష్ణవ్ నందన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో వారు గత జనవరి 17న సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు.
ప్రజావాణి బృందం చొరవ తీసుకొని, హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందేలా చూసింది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకున్నాడు. దవాఖాన ఖర్చుల కింద రూ.6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి మంగళవారం మంగళవారం బాబు తండ్రికి అందజేశారు.
