ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన మరుసటి రోజే దేశవ్యాప్తంగా CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలను కిలోకు 2 రూపాయలు పెంచారు. మే 15 నుంచి ఇది నాలుగో పెంపు కావడం గమనార్హం.
CNG rates have been increased by Rs 2 from today, 26th May.
— ANI (@ANI) May 26, 2026
ఈ పెంచిన రేట్ల తర్వాత.. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు CNG ధర కిలో 83.09 రూపాయలకు చేరింది. మే 26న 2 రూపాయలు, మే 15న 2 రూపాయలు, మే 18న రూ. 1, మే 23న రూ. 1 చొప్పున పెంచారు. మొత్తంగా.. గత 11 రోజుల్లో CNG గ్యాస్ ధర కిలోపై 6 రూపాయలు పెరగడం గమనార్హం.
CNG ధరల పెంపు వల్ల.. CNGతో నడిచే క్యాబ్లు, ఆటోలు నడిపించే వాళ్లకు ఖర్చులు పెరుగుతాయి. ఈ ప్రభావంతో ఆటో ఛార్జీలు, క్యాబ్ ఛార్జీలను పెంచడం ఖాయం. ఇలా.. ఉద్యోగాలకు, వ్యాపారాలకు ఆటోల్లో, క్యాబ్ల్లో వెళ్లే సామాన్య, మధ్య తరగతి జనం నెత్తిన ఈ భారం కూడా పడుతుంది.
రవాణా ఖర్చులు కూడా పెరిగి.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇంట్లో నుంచి బండ్లు బయటకు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా.. ఎటు చూసినా అంతిమంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ ధరల పెంపు వల్ల నానా తంటాలు పడుతున్నారు.
