లైవ్‌లో లవ్ ప్రపోజ్..  ప్లేయర్‌కు ప్రపోజ్ చేసిన కోచ్

V6 Velugu Posted on Jul 27, 2021

ఎంతో ప్రతిష్టాత్మకంగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్లేయర్‌ లైవ్ టీవీలో మాట్లాడుతుండగా.. ఆమె కోచ్ కెమెరాల సాక్షిగా లవ్ ప్రపోజ్ చేశాడు. అర్జెంటీనా ఫెన్సర్ మరియా బెలెన్ పెరెజ్ మారిస్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని మొదటి రౌండులోనే వెనుదిరిగింది. అనంతరం ఆమె మీడియాతో లైవ్‌లో మాట్లాడుతుండగా.. ఆమె కోచ్ లూకాస్ సౌసెడో వెనుక నిల్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నిస్తూ ఓ పేపర్‌ను తన రెండు చేతులతో పట్టుకున్నాడు. అది గమనించిన మీడియా ప్రతినిధులు గట్టిగా నవ్వడంతో.. ఆమె వెనుకకు తిరిగి చూసుకొని ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే తన కోచ్ ప్రపోజల్‌ను ఆమె అంగీకరించింది. మరియా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడవసారి. మరియా 2010లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నప్పుడు కూడా సాసేడో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే ఆ సమయంలో మరియా మాత్రం జోక్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత కోచ్ ప్రపోజల్‌కు మరియా అంగీకారం తెలిపింది. వీరిద్దరూ 17 సంవత్సరాల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. కోచ్ చేసిన ప్రపోజల్‌కు స్పందించిన మరియా.. ‘నేను ఏం మాట్లాడలేను. ఓ మై గాడ్.. నమ్మకలేకపోతున్నాను. మేం ఈ మధురమైన క్షణాలను అర్జెంటీనాలో సాంప్రదాయబద్దకంగా జరుపుకుంటాం’ అని పెరెజ్ మారిస్ అన్నారు. 
 

 

Tagged tokyo, Olympics, love proposal, , Argentine, fencer Maria Belen Perez Maurice, coach Lucas Saucedo, love proposal on live tv

Latest Videos

Subscribe Now

More News