Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కి అనారోగ్యం?

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కి అనారోగ్యం?

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. గురువారం  భారత్, శ్రీలంక  జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న టైమ్లో రాహుల్ హైబీపీకి లోనైనట్లు సమాచారం. మ్యాచ్ ప్రారంభానికి ముందు బీపీ పెరగడంతో ట్యాబ్లెట్లు వేసుకొని ఫీల్డ్ కి హాజరైన ద్రవిడ్.. మ్యాచ్ మొదలయ్యే సమయాని మరింత అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఇవాళ ఉదయం రాహుల్  బెంగళూరుకు వెళ్లినట్లుగా సమాచారం. అయితే రాహుల్ తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు బెంగళూరులోనే రెస్ట్ తీసుకోనున్నాడట. దీంతో ఈ నెల 15 న భారత్, శ్రీలంక మధ్య జరిగే చివరి వన్డేకు రాహుల్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. కాగా రెండు రోజుల క్రితం ద్రవిడ్ తన 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు.