
ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్ విద్యార్థుల మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. కేసును సుమోటగా స్వీకరించి విచారించిన సుప్రీం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పింది. కోచింగ్ సెంటర్లను డెత్ ఛాంబర్స్ గా మార్చారని సీరియస్ అయ్యింది. సివిల్ సర్వీస్ విద్యార్థుల మృతితో కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించింది సుప్రీంకోర్టు.
కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రత చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది సుప్రీం. అన్ని భద్రతా ప్రమాణాలను పాటించిన తర్వాతే కోచింగ్ సంస్థకు అనుమతి ఇవ్వాలని సూచించింది.
జూలై 27న రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లర్ లైబ్రరీలో వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సి విద్యార్థులు మృతి చెందారు. తానియా సోని,శ్రేయ యాదవ్,నవీన్ డాల్విన్ ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. విద్యార్థులు ఆందోళనకు దిగారు.