న్యూఢిల్లీ: కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ తన ఐపీఓ కోసం ప్రైస్బ్యాండ్ ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.21 నుంచి రూ.23 గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,071 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కంపెనీ మొత్తం విలువ రూ.10,700 కోట్ల పైగా ఉంటుంది. ఈ ఏడాది మార్కెట్లోకి వస్తున్న మొదటి ఐపీఓ ఇదే. జనవరి తొమ్మిది నుంచి 13 వరకు పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనవరి 16న స్టాక్ మార్కెట్లో షేర్లు లిస్ట్ అవుతాయి. ఇందులో 46.57 కోట్ల షేర్లను కోల్ ఇండియా ఓఎఫ్ఎస్ పద్ధతిలో విక్రయిస్తోంది. పారదర్శకతను పెంచడంతో పాటు అనుబంధ సంస్థల విలువను వెలికితీసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఎల్ దేశంలోనే అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారుగా నిలిచింది. ఝార్ఖండ్ లోని ఝరియా, పశ్చిమ బెంగాల్ లోని రాణిగంజ్ క్షేత్రాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. గత మూడు సంవత్సరాల్లో దీని బొగ్గు ఉత్పత్తి 33 శాతం పెరిగింది.
