- బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకే
న్యూఢిల్లీ: తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ జెన్కో) నుంచి రూ.1,057.09 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకున్నామని కోల్ ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌ఓఏ) అందుకున్నామని తెలిపింది. చౌటుప్పల్‌లో 750 మెగావాట్‌అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) ప్లాంట్‌ను కోల్ ఇండియా నిర్మించి, ఆపరేట్ చేయనుంది. టీజీ జెన్కో లేదా గ్రిడ్‌ల నుంచి వచ్చే కరెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది.
అవసరమైనప్పుడు జెన్కోకి ఈ కరెంట్‌ను సప్లయ్ చేస్తుంది. స్టోరేజ్ సర్వీస్ ఫీజు కింద ప్రతి మెగావాట్‌కు నెలకు రూ.3.14 లక్షలు టారిఫ్ వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ను బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పర్చేజ్ అగ్రిమెంట్ (బీఈఎస్‌పీఏ) కుదుర్చుకున్నప్పటి నుంచి 18 నెలల్లో కోల్ ఇండియా పూర్తి చేయాలి. ఈ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలను, ఇతర పత్రాలను 15 రోజుల్లో సమర్పించాలి. ఆ తర్వాత అధికారిక ఒప్పందం కుదురుతుంది.
