రూ.10 వేలకు తెచ్చి.. రూ.25 వేలకు అమ్మకం.. గంజాయి అమ్ముతోన్న మామా అల్లుళ్ల అరెస్ట్

రూ.10 వేలకు తెచ్చి.. రూ.25 వేలకు అమ్మకం.. గంజాయి అమ్ముతోన్న మామా అల్లుళ్ల అరెస్ట్

హైదరాబాద్​, వెలుగు: లంగర్​ హౌజ్‎లో డ్రగ్స్​అమ్ముతున్న, కొంటున్న ఇద్దరినీ హెచ్​న్యూ, లంగర్​హౌస్​పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి చెందిన మోహిత్​సంజయ్​మెహ్రా బీటెక్​ చదివాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ ​వచ్చి నార్సింగిలో ఉంటున్నాడు. ఇటీవల అతడు భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరచూ పబ్బులకు వెళ్తూ డ్రగ్స్‎కు అలవాటు పడ్డాడు. 

డ్రగ్స్​యూజ్​చేస్తూ పెడ్లర్‎గా కూడా మారాడు. ముంబైకి చెందిన సప్లయర్ నుంచి గ్రాముకు 10 వేలకు కొకైన్​తెచ్చి, స్థానికంగా గ్రాముకు రూ.25 వేల దాకా అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు లంగర్​ హౌజ్‎లో సంజయ్, అతని నుంచి కొకైక్​కొంటున్న పద్మారావ్​నగర్‎కు చెందిన జసన్​రాజ్‎ను పట్టుకున్నారు. వీరి నుంచి 15 గ్రాముల కొకైన్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

గంజాయి అమ్ముతున్న మామా అల్లుళ్ల అరెస్ట్..

ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న మామా అల్లుళ్లను పోలీసులు అరెస్టు చేసి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం ఖోర్డా జిల్లాకు చెందిన మహరాణా ధీనబంధు (40) వ్యవసాయం చేస్తుంటాడు. కటక్​ ప్రాంతానికి చెందిన తన అల్లుడు మోహపాత్ర(23) హైదరాబాద్‎లో బీటెక్​ చదువుతున్నాడు. వీరిద్దరు వారి రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్​రాయదుర్గం మల్కంచెరువు ఏరియాలో అమ్మేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేజీ చొప్పున ప్యాకింగ్​ చేసిన పది గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.