వందేభారత్ రైలు భోజనంలో చనిపోయిన బొద్దింక

వందేభారత్ రైలు భోజనంలో చనిపోయిన బొద్దింక

భోజనం విషయంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది.  ఫిబ్రవరి 1వ తేదీన రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక  కనిపించడంతో షాకయ్యాడు. 

 సుభేందు కేసరి అనే వ్యక్తి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తూ నాన్  వెజ్ మీల్ ఆర్డర్ పెట్టగా అందులో చనిపోయిన బొద్దింక  కనిపించింది. దీనిపై అసంతృప్తి  వ్యక్తం చేసిన ప్రయాణికుడు  భోజనానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.   ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. 

ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ వెంటనే స్పందించింది.  ప్రయాణికుడికి క్షమాపణలు కూడా చెప్పింది. అంతేకాకుండా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌‌పై  భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందిస్తూ రైల్ మదాద్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.  

గతంలో కూడా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అందించే భోజనంలో  దుర్వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు వచ్చాయి. అయినప్పటికీ ఐఆర్‌సీటీసీ తీరు మారడం లేదు.