రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

పెండింగ్ ప్రాజెక్టుల దగ్గర కాంగ్రెస్ నేతల నిరసన దీక్షలకు ప్రభుత్వం బ్రేకులు వేస్తుంది. కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు తెల్లవారుజాము నుంచే పోలీసులు మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌లను పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. తమ పార్టీ నేతల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెంటనే వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తాము చేసుకునే కార్యక్రమాలకు అడ్డుకోవద్దన్నారు. SLBC దగ్గర దీక్షా కార్యక్రమం రద్దు చేసుకొని సందర్శనకు మాత్రమే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం నాడు ఇళ్ల దగ్గర నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారాయన.

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. పీసీసీ మంగళవారం దీక్షలకు ప్లాన్ చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెండింగ్  ప్రాజెక్టుల దగ్గర  నిరసన దీక్షలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం  5 గంటల వరకు దీక్ష చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కృష్ణానదిపై  పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని  పీసీసీ నేతలు నిలదీయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా SLBC  దగ్గర  ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షకు సిద్ధమయ్యారు. పాలేరు  దగ్గర  భట్టి విక్రమార్క, సీతక్క,  పొడెం వీరయ్య  దీక్షలో పాల్గొననున్నారు. లక్ష్మీదేవిపల్లి పంపు హౌస్ దగ్గర రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఎల్లూరు జలాశయం దగ్గర నాగం జనార్దన్ రెడ్డి దీక్షకు కూర్చోనున్నారు. కరివేన దగ్గర చిన్నారెడ్డి, నెట్టెంపాడు  దగ్గర సంపత్ కుమార్, కల్వకుర్తి దగ్గర వంశీచంద్ రెడ్డి దీక్షలో పాల్గొనాలని అనుకున్నారు. అయితే హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.

For More News..

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..

ఆరేండ్లలో ఎంతో సాధించినం

సికింద్రాబాద్ నుంచి 9 రైళ్లలో 13 వేల మంది

చైనా సైనికులకు ఆయుధాలను మనమే కొనిస్తున్నం