తెలంగాణలో పంజా విసురుతున్న చలి.. పలు జిల్లాలో సివీయర్ కోల్డ్ వేవ్స్.. ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో పంజా విసురుతున్న చలి.. పలు జిల్లాలో సివీయర్ కోల్డ్ వేవ్స్.. ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణంలో చలి పులి పంజా విసురుతోంది. చలి రోజురోజుకు పెరుగుతోంది..ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ వణికిస్తున్నాయి.  తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రతలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

 ఉత్తర భారతదేశం వీస్తున్న చలి గాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ర్టంలో చలి తీవ్రత మరింత పెరిగింది.  మరో రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం సమయాల్లో పొగమంచుదట్టంగా కమ్ముకుంటోంది. 

గురువారం (డిసెంబర్ 18) ఉదయం కుమ్రం భీం ఆసిఫాబాద్ లో కనిష్టంగా 6.6 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. మంచిర్యాలలో 8 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 7.9 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి లో 7.8 డిగ్రీలు, నిర్మల్ లో 8డిగ్రీలు, నిజామాబాద్ లో 8.1 డిగ్రీలు, కామారెడ్డిలో 8.6 డిగ్రీలు, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.5 డిగ్రీల సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా రికార్డు స్థాయిలో  కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.  ఉదయం 9 గంటల వరకు కూడా చలి విపరీతంగా ఉంది. హైదరాబాద్ సిటీ అవుట్ స్కట్స్ లో కూడా చలి వణికించింది.