మండే ఎండలకు చల్లని కబురు.. రెండు రోజుల పాటు వర్షాలు..

మండే ఎండలకు చల్లని కబురు.. రెండు రోజుల పాటు వర్షాలు..

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాబోయ్ ఎండ అని ప్రజలు అనుకునేలా చేస్తున్నాడు. ఎండల కారణంగా వాతావరణ శాఖ పలు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం టైంలో ఎక్కువ బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే గురువారం రోజు చల్లని వార్త చెప్పింది భారత వాతావరణ శాఖ. 

ఏప్రిల్ 6వ తేది తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఏప్రిల్ 7వ తేది సాయంత్రం నుంచి 8వ తేది వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని అంచనా వేసింది. 

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం, నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా తెలిపారు. బుధవారం రోజు రాష్ట్రంలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నట్టు తెలిపారు.  ఎల్ నినో కారణంగా, హైదరాబాద్‌లోనే కాకుండా భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది