రాజన్నసిరిసిల్ల జిల్లాలో 14 వేల కొత్త రేషన్‌‌‌ కార్డులు పంపిణీ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల జిల్లాలో 14 వేల కొత్త రేషన్‌‌‌ కార్డులు పంపిణీ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల/వీర్నపల్లి, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని రాజన్నసిరిసిల్ల  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో, వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల ప్రొసీడింగ్స్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజన్నసిరిసిల్లలో 14వేల కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు రాని వారు ఉంటే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

ముస్తాబాద్, వెలుగు: ముస్తాబాద్ మండలకేంద్రంలోని తహసీల్దార్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పరిశీలించారు. అనంతరం రైతు వేదికలో తెలంగాణ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోరం ఆధ్వర్యంలో 28 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా కార్యక్రమాల్లో కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల, ముస్తాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లు స్వరూపరెడ్డి, తలారి రాణి,ఆర్డీవో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డీఎం రజిత, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, 
పాల్గొన్నారు.