లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  •  కలెక్టర్ ​ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు : మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు.  మంగళవారం కలెక్టరేట్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ లోకల్, ఇంటర్నల్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. 

మహిళలపై లైంగిక వేధింపుల సమస్య వచ్చినప్పుడు ఆన్​లైన్​ బాక్స్ పోర్టర్​లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.  జిల్లా లీగల్ అథారిటీ కమిటీ సెక్రటరీ, జడ్జి టి.నాగరాణి, అడిషనల్ కలెక్టర్​ మదన్మోహన్,  జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.   

తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు బదిలీ

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ  కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  రాజానరేందర్​గౌడ్ బాన్సువాడ తహసీల్దార్​గా, వి.వరప్రసాద్​ను కామారెడ్డి కలెక్టరేట్​కు, ఎ.మహేందర్​కుమార్​ను  పిట్లం తహసీల్దార్​గా, భిక్షపతి పెద్దకొడప్​గల్​, కె.సవల్ సింగ్ మహమ్మద్​నగర్ తహసీల్దార్​గా, సాయి భూజంగ్​రావును  నిజాంసాగర్​ తహసీల్దార్​గా,  ఎం.వసంతను బాన్సువాడ ఆర్డీవో ఆఫీసుకు,  రోజా కాముని నాయబ్​ తహసీల్దార్​ను  బీబీపేటకు,  సంతోషి నాయబ్ తహసీల్దార్​ను  భిక్కనూరుకు,  యు.శృతి నాయబ్​ తహసీల్దార్​ను  రాజంపేటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అభ్యంతరాలపై గడువులోగా చర్యలు తీసుకోవాలి 

మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా ముసాయిదా ఓటరు లిస్టుపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై గడువులోగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  మంగళవారం కలెక్టరేట్​లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. 

ముసాయిదా ఓటర్ల లిస్టుపై ఆయా పార్టీల నాయకులు అభ్యంతరాలు తెలిపారు.  మార్పులు, చేర్పులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్​, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.