నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్ పెట్టొద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి 51 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ఎంతోమంది వ్యయప్రయాసలకోర్చి ఇక్కడి వస్తుంటారని తెలిపారు. వారి వినతులపై సత్వరమే స్పందించాలని, చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత సమాచారాన్ని దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు.
