ఏటూరునాగారం/ మంగపేట, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆర్డీసీ బస్ డిపో ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 3.32 ఎకరాల్లో డిపో నిర్మాణం చేసేందుకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్ ఆర్టీసీ ఆఫీసర్లను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్టీసీ ఈఈ భాస్కర్, డీఎం సురేశ్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, మంగపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్, పీఏసీఎస్ కాంప్లెక్స్ మధ్య ఆర్టీసీ బస్టాండ్‌కు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. బస్టాండ్‌కు కేటాయించిన స్థలంలో కరెంట్ పోల్స్ఉండడంతో వాటిని తొలగించాలని ఏఈని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్మంగపేట మండలం మల్లూరు శివారులోని హేమాచల క్షేత్రాన్ని సందర్శించి, లక్ష్మీనృసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అధికారులు టైం పాటించాలి..
అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ దివాకర సూచించారు. శుక్రవారం మంగపేట తహసీల్దార్ఆఫీస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు. కార్యాలయాలకు వచ్చిన ప్రతి దరఖాస్తు స్వీకరించిన తేదీ, పరిష్కారమైన తేదీలు నమోదు చేయాలన్నారు.
రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తుల రవి, తహసీల్దార్ వీరాస్వామి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.