మొంథా తుపాన్‌ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి : ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మొంథా తుపాన్‌ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి : ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మొంథా తుపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, బ్రిడ్జిలను సర్వే చేసి నష్ట తీవ్రతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం తుపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టం అంచనాలపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. తుపాన్ వల్ల పాక్షికంగా, పూర్తిగా  నష్టపోయిన ఇండ్ల వివరాలను రెవెన్యూ, పంట నష్టంపై వ్యవసాయ శాఖ, రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు నష్టంపై ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, పీఆర్ అధికారులు వివరాలు తీసుకోవాలన్నారు. 

స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ హాస్టళ్ల, ప్రభుత్వ శాఖల భవనాల్లో లీకేజీలపై వివరాలు సేకరించాలన్నారు. పూర్తి నివేదికను మంగళవారంలోగా అందజేయాలని అన్ని శాఖల అధికారులను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్​ ఆదేశించారు.  మీటింగ్ లో అడిషనల్ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఈఈ నరసింహాచారి, డీఏవో అఫ్జల్ బేగం, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ, సెస్ ఎండీ భిక్షపతి పాల్గొన్నారు.

వేములవాడరూరల్, వెలుగు: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శనివారం వేములవాడ మండలం హన్మాజీపేటలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, ఫార్మసిని పరిశీలించారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని
 సూచించారు.