
హైదరాబాద్ సిటీ, వెలుగు: మలక్ పేటలోని అంధ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హరిచందన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. హాస్టల్కాంపౌండ్ వాల్‌పై ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాస్టల్ఎడమవైపు శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ గృహాలను పరిశీలించారు. వైరింగ్ సమస్య ఉందని తెలియడంతో పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా తమకు డైనింగ్ హాల్, సెక్యూరిటీ కావాలని కలెక్టర్‌ను విద్యార్థులు కోరారు.
వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు రాజేందర్, తహసీల్దార్జయశ్రీ, హెచ్ఎం అస్రా ఫాతిమా పాల్గొన్నారు. అలాగే గురువారం ఐదుగురు బాలురు పరారైన నేపథ్యంలో సైదాబాద్‌లోని జువైనల్హోంను కలెక్టర్ విజిట్ చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు.