
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆగస్టు 27న వినాయక చవితి పండుగ ఉండడంతో కుమ్మరి సొసైటీ సభ్యులతో మట్టి విగ్రహాలు తయారుచేయిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటనలో పేర్కొన్నారు. పీవోపీ విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. గుడిమల్కాపూర్ పూల మార్కెట్, మోహిదీపట్నం రైతుబజార్, టెంపుళ్ల వద్ద, అమీర్ పేటలోని కూడళ్లతో పాటు అన్ని మార్కెట్ యార్డుల్లో ఈ విగ్రహాలు విక్రయించనున్నట్లు తెలిపారు.
ఆర్డర్ చేసేందుకు 94900 27838, 96667 04555, 99121 54519, 93473 17210, 99637 16118 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఒక ఫీట్ నుంచి 4 ఫీట్ల వరకు తక్కువ ధరకే విగ్రహాలు లభ్యమవుతాయన్నారు.