ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి 

ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి 

ములుగు, వెలుగు : ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ములుగు జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాల్లో 10,299 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని శనివారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 7రూట్లు, 12లోకేషన్లు, 17పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ములుగు 4, వెంకటాపూర్ లో 2, గోవిందరావుపేటలో 2, ఏటూరునాగరంలో 2, మంగపేటలో 2, వెంకటాపురంలో 2, తాడ్వాయి, కన్నాయి గూడెం, వాజేడు మండలాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.