యాదాద్రి, వెలుగు : హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించనున్న పోచంపల్లి వస్త్ర ప్రదర్శనకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆహ్వానించారు. యాదగిరిగుట్టకు వచ్చిన సీఎంకు ఆహ్వాన పత్రికను అందించారు. జూన్ 5, 6, 7 తేదీల్లో హైటెక్స్ నిర్వహించే ప్రదర్శనకు రావాలని కలెక్టర్ కోరారు.
