- ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేశ్
భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 29న గోదావరి తీరాన జరిగే తెప్పోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వెల్లడించారు. ఆయన మంగళవారం ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను స్నానఘట్టాల వద్ద పరిశీలించారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక పర్యాటక విడిది గృహాలు, గిరిజన వంటకాలు, గిరిజన కళాఖండాలకు సంబంధించిన స్టాల్స్బో ట్ షికార్ పరిసరాలను ఆయన తనిఖీ చేశారు.
గత సంవత్సరం తరహాలోనే ఈసారి కూడా స్పెషల్ కల్చర్ ప్రోగ్రాంలు ఉంటాయన్నారు. తెప్పోత్సవం ర్యాంపు పక్కన ప్రత్యేక స్టేజీని నిర్మిస్తామన్నారు. భద్రాచలంతో పాటు దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్పను కూడా ఉత్సవాలకు వచ్చే భక్తులు, టూరిస్టులు సందర్శించేలా, వారిని మెప్పించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఈవో దామోదర్‌రావు ఉన్నారు.

